← Back to news

పెరిగిన గోదావరి ప్రవాహం.. APSDMA అలర్ట్!

By Bala· 1d ago
పెరిగిన గోదావరి ప్రవాహం.. APSDMA అలర్ట్!

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 40 అడుగులకు చేరినట్లు APSDMA తెలిపింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా ఉన్నాయని తెలిపింది. ఈ ప్రవాహం 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల వద్ద వరద నీటిలో ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

More in Local