బైక్‌ను ఢీకొన్న వాహనం.. వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మంబాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సాపూర్‌కు చెందిన దుర్గప్పగారి సుధాకర్ గౌడ్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన ఎంక్వేరీ ప్రకారం.. బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి నర్సాపూర్ వెళ్తుండగా MDK-HYD జాతీయ రహదారిపై అర్బన్ పార్కు వద్ద ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



