← Back to news

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

By Srikanth Goud· 1h ago· Jagitial, Jagitial, Jagitial
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తపస్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్ డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీని ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు. 317 జీఓ ప్రకారం స్థానికత కేటాయింపు చేపట్టాలని, కేజీబీవీ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని అన్నారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు సీపీఎస్ అరియర్స్ వర్తింపజేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

More in Local