← Back to news

పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి

By sunil· 20h ago· Sri Potti Sriramulu Nellore
పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి

నెల్లూరు జిల్లా ఉదయగిరి పంచాయతీ ఆఫీసులో రైతు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. మెట్ట ప్రాంతానికి ఆశాజ్యోతి అయిన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టు కాలువకు మాజీ మంత్రి స్వర్గీయ మాదాల జానకిరామ్ పేరు పెట్టాలని కోరారు. ఉదయగిరిలో మూడు రోజులకొకసారి ఇచ్చే నీటి సరఫరా పద్ధతిని మార్చి తాగునీటి సమస్యను తీర్చాలని స్పష్టం చేశారు.

More in Local