భారీ వృక్షం నేలకొరిగి.. ప్రమాదం తప్పింది!

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో భారీ వృక్షం నేలకొరిగింది. బుధవారం సాయంత్రం కాశీపట్నం సంత సమీపంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా సంతకు ఎవరూ రాలేదు. రోడ్డుపై వాహనాలు, ప్రజలు, పశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ డిస్టర్బ్ అయింది. వాహనాలను పక్క మార్గంలో మళ్లించారు. అధికారులు చెట్టును తొలగించే పనిలో ఉన్నారు.


