← Back to news

అంగన్వాడిలో.. కలకలం (Video)

By Prashanth· 7 Oct 2026

TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అంకుసాపూర్–తెలిగూడ అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు గాయపడ్డారు. 3 ఏళ్ల సాత్విక్, 4 ఏళ్ల నిహారిక, 5 ఏళ్ల సాయినాథ్‌, తల్లులు సోనీ, సంధ్యారాణి‌కి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉందని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

More in TG