నవాబుపేట మండలంలో BSP సమావేశాలు

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కిషన్ గూడ, గుబ్బడిగుచ్చ తండా గ్రామాల్లో BSP నాయకులు సమావేశాలు నిర్వహించారు. BSP వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘బహుజన రాజ్యాధికార సమర భేరి’ సభను విజయవంతం చేయాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు BSPతోనే సాధ్యమని నాయకులు తెలిపారు. సభ లక్ష్యాలు, ప్రాధాన్యతపై గ్రామస్తులకు వివరించారు.



