సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేశారు!

TG: హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అమెజాన్ డెలివరీ పాయింట్ ఏర్పాటు పేరుతో ఓ వ్యక్తి నుంచి 48 లక్షలు కాజేశారు. గూగుల్ రేటింగ్ టాస్కుల పేరుతో నకిలీ యాప్‌లో డబ్బులు వేయించి మరో వ్యక్తిని మోసం చేశారు. నకిలీ ట్రాఫిక్ చలాన్ యాప్ ద్వారా ఇంకొకరి ఖాతా నుంచి 3.16 లక్షలు మాయం చేశారు. అపరిచిత లింకులు, పెట్టుబడులు, టాస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.



