← Back to news

డిచ్‌పల్లిలో చాకలి ఐలమ్మ జయంతి

By Ravi· 1d ago· Nizamabad
డిచ్‌పల్లిలో చాకలి ఐలమ్మ జయంతి

డిచ్‌పల్లి మండలంలోని 7వ బెటాలియన్ ఏరియాలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. కమాండెంట్ సీతారాం ఆమె ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరసింహారావు, విజయ్, బెటాలియన్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించారు.

More in Local