కల్లుగీత సంఘం కొత్త కమిటీ

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట-నాగుర్లపల్లిలో కల్లుగీత కార్మిక సంఘం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులు దేశిని ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, అధ్యక్షుడిగా గంధం శ్రీను గౌడ్, ఉపాధ్యక్షుడిగా మచ్చిక సతీష్ గౌడ్, కార్యదర్శిగా కట్ల పెద్ద రాజు, కోశాధికారిగా కట్ల చిన్న రాజు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.



