రుద్రూర్‌లో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో ఆయన ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా చెరువులు, నీటి వనరులు కాలుష్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చని నాయకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.