94,400 కోట్ల రూపాయల బెట్టింగ్.. ఇంకా రన్నింగ్‌లో యాప్!

ఆన్‌లైన్ బెట్టింగ్ పేరుతో ‘మహాదేవ్’ యాప్ భారీగా డబ్బు సంపాదించిందని ED ఆరోపించింది. గత 10 ఏళ్లలో యాప్, దాని సిస్టర్ వెబ్‌సైట్ల ద్వారా 94,400 కోట్ల రూపాయల అక్రమ డబ్బు వచ్చినట్లు రాయ్‌పూర్ కోర్టుకు ఇచ్చిన ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. మహాదేవ్ యాప్ ఇంకా యాక్టివ్‌గా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేసి రూ.2,104 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపింది.



