← Back to news

కామన్ పాస్ ఛార్జీలపై కంప్లయింట్స్..ప్రభుత్వం కీలక నిర్ణయం

By Sharmila· 6h ago
కామన్ పాస్ ఛార్జీలపై కంప్లయింట్స్..ప్రభుత్వం కీలక నిర్ణయం

TG:హైదరాబాద్‌లో ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ రేట్లపై ప్రజల నుంచి వస్తున్న విమర్శల కారణంగా ప్రభుత్వం మరోసారి పరశీలిస్తానని చెప్పింది. రోజువారీ పాస్ ధర ₹400, నెలవారీ పాస్ ధర ₹8,500గా ఉండటంపై ప్రజల నుంచి ఎక్కువగా కంప్లయింట్స్ వస్తున్నాయి. దీంతో రేట్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్చే అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులపై భారం తగ్గేలా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

More in TG