పెట్టుబడుల పేరుతో 20 లక్షల మోసం

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లిలో పెట్టుబడుల పేరుతో మోసం జరిగినట్లు పలువురు బాధితులు ఆరోపించారు. విదేశీ యాప్‌లో డబ్బులు పెట్టుబడిగా పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని ఓ ఏజెంట్ నమ్మించడంతో గ్రామానికి చెందిన 10 మంది సుమారు 20 లక్షలు పెట్టినట్లు తెలిపారు. కొంతకాలం తర్వాత యాప్ పనిచేయకపోవడంతో పెట్టిన డబ్బులు తిరిగి రాకపోయాయని వాపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి, తమకు న్యాయం చేయాలని కోరారు.



