TNలో భారీ వర్షాలు.. మాన్సూన్ స్టార్ట్!

TNలో ఈశాన్య మాన్సూన్ మొదలైంది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కరూర్ జిల్లా తొగమలై, మయిలాదుతురై జిల్లా తిరువెంకాడులో 11 సెం.మీ. వర్షం నమోదైంది. తరంగంబాడి, మరుతంపల్లం, నాగపట్నంలోనూ భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం.. అక్టోబర్ 21 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ప్రజలు అధికారుల హెచ్చరికలు పాటించాలని సూచించారు.



