← Back to news

కూరగాయలు పండిస్తే ఇంత లాభమా ?

By BK· 11h ago· రాజన్న సిరిసిల్ల
కూరగాయలు పండిస్తే ఇంత లాభమా ?

TG : సిరిసిల్లలోని పెద్ద బోనాలలో మల్లయ్య అనే రైతు వరి సాగు ఆపి వంకాయ, మిరప, కాకర పంటలు వేశాడు. ఈ తోటను కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించి రైతును మెచ్చుకున్నారు. వంకాయల వల్ల అన్ని ఖర్చులు పోను ఏడాదికి 2 లక్షల రూపాయిలకు పైగా లాభం వస్తోందని రైతు చెప్పారు. పంట నాటిన 45 రోజుల నుంచే దిగుబడి వస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎల్ నినో వల్ల రైతులు కూరగాయలు, పండ్లతోటలు వేయాలని సూచించారు.

More in TG