← Back to news

ఇంటికి వచ్చి శవంగా మారింది!

By Sahani· 10h ago· AP
ఇంటికి వచ్చి శవంగా మారింది!

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం వేంగనపాలెంలో నర్సింగ్ స్టూడెంట్ 18ఏళ్ల హరిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మంలో ఫస్ట్ ఇయర్ నర్సింగ్ చదువుతున్న ఈ యువతి, రీసెంట్‌గా ఇంటికి వచ్చింది. పక్కింటికి వెళ్లిన హరిణి ఎంతకీ తిరిగిరాకపోవడంతో వెతగ్గా.. స్థానికులు బాత్‌రూమ్ వెనుక ఆమె డెడ్‌బాడీని గుర్తించారు. వీపుపై గాయాలు ఉండటంతో పక్కింటి వారే ఈ దారుణం చేసి ఉంటారని తల్లి ఆరోపిస్తోంది. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కేస్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in TG