"మూడేళ్లు నరకం అనుభవిస్తారు" నా అన్వేషణ ఫైర్
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలపై తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తున్న యూట్యూబర్ అన్వేష్.. ట్యాంక్‌బండ్‌పై భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితి ప్రతినిధులు ఇటీవల చేసిన ఆందోళనను ఖండించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్ని నిమజ్జనం చేస్తే, భూగర్భ జలాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యల వల్లే ఎల్‌నినో వచ్చిందన్న అన్వేష్.. మూడేళ్లపాటూ చుక్క నీరు లేక, నరకం అనుభవిస్తారు అని అన్నారు.
