లైసెన్స్ సస్పెండ్.. 2 రోజులకే మళ్లీ రెస్టారెంట్లు ఓపెన్!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ ఏరియాల్లోని కొన్ని రెస్టారెంట్స్ FSSAI లైసెన్స్ సస్పెండ్ అయ్యాక కూడా జస్ట్ రెండు రోజులకే మళ్లీ ఓపెన్ అయిపోయాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడంతోనే ఈ హోటల్స్ మళ్లీ రన్ అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇచ్చే వార్నింగ్స్, రైడ్స్ కేవలం న్యూస్ వరకే పరిమితం అవుతున్నాయని, కస్టమర్స్ హెల్త్‌తో ఆడుకుంటున్నారని ఫుడ్ లవర్స్ బాగా ఫైర్ అవుతున్నారు.



