← Back to news

కామారెడ్డిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

By Ramu· 1d ago· Kamareddy, Kamareddy, Kamareddy
కామారెడ్డిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్టీవోస్ కాలనీ ప్రసన్నాంజనేయ ఆలయంలో 200 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పీఓపీ, రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల జలాశయాలు కలుషితమవుతున్నాయని కౌన్సిలర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని ఆమె కోరారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

More in Local