ఉద్యమకారుల హక్కుల కోసం యాదగిరిగుట్టలో రాష్ట్ర సభ
ఆదివారం భువనగిరి–యాదగిరిగుట్టలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సభ జరుగుతుంది. ఉద్యమకారుల సంక్షేమం, ప్రభుత్వ హామీల అమలు కోసం ఈ సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శీను ఈ వివరాలు తెలిపారు. 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని జిల్లా ఫోరం కార్యదర్శి కోదాటి వెంకన్న పిలుపునిచ్చారు. సభలో ఉద్యమకారుల సమస్యలు, హక్కులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు.



