← Back to news

కొండపల్లి మున్సిపల్ నామినేషన్లకు సర్వం సిద్ధం

By Rajiv Raju· 1d ago· Ntr
కొండపల్లి మున్సిపల్ నామినేషన్లకు సర్వం సిద్ధం

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్రవారం జెడ్పీ బాలికల పాఠశాలలో ఏర్పాట్లను అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ శ్రీనివాసులు పరిశీలించారు. 40 వార్డులకు 10 టేబుళ్లు, చైర్మన్ అభ్యర్థులకు ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేశారు. 55 మంది సిబ్బందితో నామినేషన్లు స్వీకరించనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ సాగనుండగా, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు కూడా ఇక్కడే నిర్వహించనున్నారు.

More in Local