← Back to news

లోక్‌అదాలత్‌లో రైతులకు రూ.13.56 లక్షల పరిహారం

By SHAIK SUBHANI· 2d ago· Madugula, Madugula, Anakapalli
లోక్‌అదాలత్‌లో రైతులకు రూ.13.56 లక్షల పరిహారం

AP: పల్నాడు జిల్లా గురజాలలో లోక్‌ అదాలత్ ద్వారా భూసేకరణ పరిహారం కేసులు పరిష్కరించి రైతులకు రూ.13,56,360 పరిహారం చెక్కును అందజేశారు. ఎన్టీపీసీ కోసం భైరవునిపాడు, తాళ్లపల్లి రైతులు భూములు ఇవ్వగా, తగిన పరిహారం అందక 40 మంది రైతులు 24 ఎల్‌ఏఓపీ కేసులు దాఖలు చేశారు. అప్పీల్ నేపథ్యంలో 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్.జయలక్ష్మి సమన్వయంతో లోక్‌అదాలత్‌లో కేసులను పరిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

More in Local