← Back to news

యువత కోసం ‘భవితకు భరోసా’ కార్యక్రమం

By Bala· 7h ago
యువత కోసం ‘భవితకు భరోసా’ కార్యక్రమం

AP: పంచుమర్తి అనురాధ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అమరావతిలో చెప్పారు. రెండేళ్లలో 8 లక్షల ఉద్యోగాలు అందించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సెప్టెంబరు 16 నుంచి 29 వరకు ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు యూనివర్సిటీలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లలో యువతను కలుస్తారు. ఉద్యోగ కల్పన పథకాలు, మెగా డీఎస్సీ పారదర్శకత, గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలను వివరిస్తారని తెలిపారు.

More in AP