← Back to news

చిరుతపులి సంచారం.. కుక్కలతో తప్పిన ప్రమాదం

By DK· 8 Jul 2026· నిజామాబాద్ జిల్లా
చిరుతపులి సంచారం.. కుక్కలతో తప్పిన ప్రమాదం

TG: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి శివారులో చిరుత పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లి శివారులో రైతు శ్రవణ్‌కు చెందిన కోళ్ల ఫామ్‌కు వద్దకు వచ్చిన పులి విజువల్స్ CC కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుతను చూసి కుక్కలు అరవడంతో వెనుదిరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు అడవికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More in Local