అల్లూరి జిల్లాలో పెన్షన్ల పరిశీలన

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన స్పీడ్‌గా జరుగుతోంది. ఈనెల 7 నుంచి 18 వరకు వచ్చిన 19,631 దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. DRDA ప్రాజెక్టు డైరెక్టర్ జయకృష్ణ ఆధ్వర్యంలో వీటిని పరిశీలించగా, శనివారం నాటికి 17,867 దరఖాస్తులు అర్హత సాధించినట్లు, నిబంధనల ప్రకారం లేని 1,752 దరఖాస్తులను తిరస్కరించినట్లు సత్యనారాయణ తెలిపారు.



