గోదావరిలో వరద.. దేవిపట్నంలో ఆలయం మునిగింది!

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరుగుతోంది. గండిపోశమ్మ ఆలయం వద్ద ఆరు అడుగులకు పైగా నీరు చేరింది. ఆలయ గోపురం వరకు వరద నీరు చేరడంతో భక్తులు కొండపై నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో దుకాణాలు మునిగాయి. పోశమ్మగండి నుంచి నాగలపల్లి వరకు R&B రోడ్డుపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. సీతపల్లి వాగు కూడా ఉప్పొంగుతోంది. మీ ప్రాంతంలో వరద పరిస్థితి ఎలా ఉంది? మీ వార్త పంపండి!