అంతర్జాతీయ సదస్సుకు ఖమ్మం యువకుడు

ఖమ్మం జిల్లా వేంసూరు గ్రామానికి చెందిన మిద్దె రాము అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జనవరి 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న FLAIR-2027 సదస్సులో ఆయన తన పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. యూజీసీ-NETలో వరుసగా ఐదుసార్లు ఉత్తీర్ణత సాధించిన రాము 99.23 పర్సంటైల్ సాధించారు. ప్రస్తుతం పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఎంపిక కావడంతో వేంసూరు గ్రామస్తులు రామును అభినందించారు.



