← Back to news

ఘనంగా గణేష్ భారీ శోభాయాత్ర

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరిలో గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ గణేష్ విగ్రహాన్ని భక్తులు శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. గణనాథుడి లడ్డూ ప్రసాదానికి నిర్వహించిన వేలం పాటలో జగ్గవరపు సాంబశివరావు 1,90,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం విగ్రహాన్ని మెయిన్ బజార్, గౌతమ బుద్ధ రోడ్డు, తెనాలి రోడ్డు మీదుగా రవీంద్రపాడు వంతెన వద్ద నిమజ్జనం చేశారు.

More in Local