గణేష్ ఉత్సవాలపై పోలీసుల కీలక సూచనలు

TG: ఖమ్మం జిల్లా వేంసూరు మండల పోలీస్‌స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఎస్‌ఐ పల్లెల ప్రదీప్ సమావేశం నిర్వహించి భద్రతా సూచనలు చేశారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు ప్రాంతాలు, నిర్వాహకుల వివరాలు, నిమజ్జన తేదీలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గతేడాది వెంకటాపురంలో నిమజ్జనం సందర్భంగా వ్యక్తి మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ ఈసారి నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలకు అనుమతి లేదని ఎస్‌ఐ స్పష్టం చేశారు.



