← Back to news

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

By Praveen· 1d ago· రంగారెడ్డి
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఐలమ్మ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని కలెక్టర్ తెలిపారు. ఆమె పోరాట స్ఫూర్తితోనే లక్షలాది ఎకరాల భూమి పేదలకు దక్కిందని, అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు.

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

More in Local