మటన్ కోసం పెళ్లిలో తన్నుకున్నారు 🤯

బీహార్: సహర్సా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మటన్ వడ్డిస్తాం అని చెప్పి చికెన్ వడ్డించారని వరుడి బంధువులు నిలదీశారు. ఈ మెనూ మార్పుపై మొదలైన వాగ్వాదం ఏకంగా దాడుల దాకా వెళ్లింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పెళ్లి వేడుక కాసేపు ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు.



