'ప్యారడైజ్'లో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు

నాని లీడ్ రోల్‌లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. 1980ల నాటి ప్యారడైజ్ ప్రాంతంలో సాగే కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, సీనియర్ యాక్టర్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలు కనిపించాయి. ఎమ్మెల్యే 'శంకరన్న' పాత్రలో నటుడు ప్రియదర్శి మాట్లాడే యాస, బాడీ లాంగ్వేజ్, లుక్ కేసీఆర్‌ను గుర్తుకు తెస్తోంది. సీనియర్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలో పి.విజయ్ కుమార్ నటించారు. గతంలో ఆయన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలోనూ ఎన్టీఆర్‌లా నటించారు.



