చికిత్స కోసం హాస్పటల్‌కి వెళ్తే.. పిల్లలకు HIV!

పాకిస్థాన్‌లో చిన్న అనారోగ్యంతో హాస్పిటల్‌కి వెళ్లిన కొందరు పిల్లలకు HIV ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. కరాచీలోని కుల్సూమ్ బై వలికా హాస్పటల్‌లో చికిత్స పొందిన పిల్లల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఇంజెక్షన్లు, డ్రిప్‌ల కోసం ఉపయోగించిన సూదులు, సిరంజీలను మళ్లీ వాడటం వల్లే HIV సోకిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుల్లో కనీసం ఆరుగురు పిల్లలు మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. HIV హాస్పిటల్ నుంచే సోకిందని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.


