← Back to news

సీఎం విజయ్ బర్త్ డే కు త్రిష ఎమోషనల్ విషెస్ !

By DS· 24 Jun 2026· chennai
సీఎం విజయ్ బర్త్ డే కు త్రిష ఎమోషనల్ విషెస్ !

నటి త్రిషకు, తమిళనటుడు, సీఎం విజయ్ కు మధ్య బ్రేకప్ అయిందన్న రూమర్లకు త్రిష ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టారు. సీఎం విజయ్ పుట్టిన రోజైన 22న కాకుండా మరుసటి రోజున ఆమె ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టారు. అత్యంత విలువైన వ్యక్తికి హ్యాపీ బర్త్ డే అంటూ హార్ట్ సింబల్ గుర్తులతో మెసేజ్ చేశారు. ఆ క్యాప్షన్ వెంటే విజయ్ తనతో ఇంటిమేట్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో విజయ్ కేక్ వంక చూస్తుండగా త్రిష విజయ్ వంక చూస్తున్నట్లుగా ఉంది. ఈ ఒక్క బర్త్ డే మెసేజ్ తో వీరిద్దరికి మధ్య బ్రేకప్ అయిందన్న వార్తలకు చెక్ చెప్పినట్లయింది.

More in News