← Back to news

గుంటూరులో ఓటర్ల తుది జాబితా విడుదల

By DK· 10h ago
గుంటూరులో ఓటర్ల తుది జాబితా విడుదల

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 76 వార్డులకు గాను మొత్తం 6,20,566 మందితో కూడిన తుది ఓటర్ల జాబితాను కమిషనర్ కె. మయూర్ అశోక్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరపాలక కార్యాలయంలో తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించామని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతామని కమిషనర్ తెలిపారు. 2026 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకుని జాబితాను సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో 57 వార్డులు ఉండగా, ఇటీవల 76 వార్డులుగా పునర్విభజించినట్లు పేర్కొన్నారు.

More in Local