రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్వాపురం మండలం మొండికుంట కట్టుకలవ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో బైక్‌పై ఉన్న మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, మహిళ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



