← Back to news

రైలులో మంటలు..ప్రయాణికుల్లో భయం

By Sharmila· 7 Oct 2026

TG: తెలంగాణ యాదాద్రి-భువనగిరి జిల్లా బిబినగర్ దగ్గరలో ఈ రోజు సిర్పూర్-కాగజ్‌నగర్ ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. ట్రైన్ చక్రానికి బ్రేక్ లైనర్ రుద్దుకోవడంతో పొగ, మంటలు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. దీనిని కో-పైలట్ గుర్తించి లోకో పైలట్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ట్రైన్ నిలిపివేశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

More in TG