← Back to news

బిల్లుల కోసం పైపై పనులు

By RajkumarGoud· 1d ago· Bijinapalle, Bijinapally, Nagarkurnool
బిల్లుల కోసం పైపై పనులు

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో నడిరోడ్డుపై వేసిన డ్రైనేజీ పైప్ వాహనదారులకు ఇబ్బందిగా మారింది. కొత్త MPDO కార్యాలయం నుంచి డ్రైనేజీకి పైప్‌ను రోడ్డుపై నుంచి వేయడంతో MRO, MEO, పంచాయతీరాజ్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్‌పై వెళ్లేవారు పైప్ దాటే సమయంలో స్కిడ్ అయి కిందపడిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కార్ల బంపర్లకు పైప్ తగిలి వాహనాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. పనులు పూర్తిగా చేపట్టకుండా బిల్లుల కోసం పైపై పనులు చేశారని ఫైరవుతున్నారు.

బిల్లుల కోసం పైపై పనులు

More in Local