← Back to news

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ ఆందోళన

By Bala· 3h ago

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో SIR ప్రక్రియలో ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. AICC పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి ఓటర్ల జాబితా అంశంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్, MLA గండ్ర సత్యనారాయణ రావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.

More in Local