పద్మావతి సంఘంలో బతుకమ్మ ఫుల్ జోష్!

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పద్మావతి గ్రామైక్య సంఘంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీవో వెంకట శివానంద్, ఏపీఎం తిలక్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి కాపాడుకోవాలని, బతుకమ్మ పాటలు భావితరాలకు అందించాలని సూచించారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు లక్క కీర్తన, ప్రధాన కార్యదర్శి ముదురు సుగుణ, ఉపాధ్యక్షురాలు కంది పూలమ్మ, కార్యదర్శి మహేశ్వరి, నిర్మల, మంజుల, సుజాత, రజిత, ఉమా, సభ్యులు పాల్గొన్నారు.



