ఆ రైస్ మిల్లులకు షాక్!

TG: విజిలెన్స్ తనిఖీల్లో తప్పులు బయటపడిన 143 రైస్ మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఈ మిల్లులకు ప్రభుత్వ ధాన్యం ఇచ్చి బియ్యం తయారు చేయించే పనిని ఆపేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మిల్లుల్లో తనిఖీలు పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో మరిన్ని మిల్లుల్లో తప్పులు బయటపడితే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ధాన్యం విషయంలో తప్పులు చేసిన మిల్లులపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
