← Back to news

దళిత మహిళపై దాడి.. కేసు నమోదు!

By Sahani· 2h ago· నల్లగొండ జిల్లా

TG: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పి.కే. మల్లేపల్లి గ్రామంలో దళిత మహిళపై దాడి ఘటన కలకలం రేపింది. సంఘాలకు సంబంధించిన డబ్బుల విషయంలో కొప్పోలు అమరనాథ్ గౌడ్ కుల అహంకారంతో దుర్భాషలాడుతూ తనపై దాడి చేశారని VOA గనిపల్లి మాధవి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. గ్రామ సభలో తనపై వచ్చిన ఆరోపణలను ప్రశ్నించినందుకే దాడి చేసినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై చింతపల్లి పోలీసులు SC, ST అట్రాసిటీ యాక్ట్‌తో పాటు BNSలోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More in TG