డెలివరీ లేట్.. జొమాటో వర్కర్‌పై కపుల్ దాడి!
TG: సికింద్రాబాద్‌లోని వాసవి నగర్‌లో జొమాటో డెలివరీ వర్కర్‌పై ఓ జంట దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫుడ్ డెలివరీ లేట్ అయిందని జంట తనపై దాడి చేసిందని డెలివరీ వర్కర్ ఆశిష్ ఆరోపించాడు. కస్టమర్లు షేర్ చేసిన లొకేషన్ తప్పుగా ఉండటంతో డెలివరీ లేట్ అయిందని, కారణం చెప్పినా వినకుండా దాడి చేశారని తెలిపాడు. ఘటన CCTVలో రికార్డైంది. ఆశిష్ కార్ఖానా పోలీసులకు కంప్లైంట్ చేసి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు.

