← Back to news

390కి పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత

By Bala· 2h ago
390కి పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 390కి పైగా అనుమతి లేని భవనాలను అధికారులు కూల్చివేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. అంజయ్య నగర్ భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన తర్వాత తనిఖీలు ముమ్మరం చేశారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో అనుమతుల్లేని, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి.

More in TG