లగ్జరీ లైఫ్ కోసం.. నెల రోజుల బిడ్డను అమ్మేశారు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ జంట తమ నెల రోజుల బేబీని 1లక్ష 20వేల రూపాయలకు అమ్మేసినట్లు పోలీసులు తెలిపారు. కాస్ట్‌లీ ఫోన్లు, గోల్డ్ చైన్ కొనడానికి ఈ పని చేసినట్లు చెప్పారు. మీడియేటర్ల చేతులు మారుతూ బేబీ చివరకు హైదరాబాద్‌కి చేరింది. మహారాష్ట్ర పోలీసులు.. హైదరాబాద్‌లో బేబీని రక్షించారు. ఈ కేసులో తల్లిదండ్రులతో పాటూ మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కాస్ట్‌లీ స్మార్ట్‌ఫోన్లు, గోల్డ్‌చైన్‌ను సీజ్ చేశారు.
