← Back to news

రీల్‌ కోసం స్టంట్‌.. చివరికి బైక్‌ సీజ్‌!

By Anusha· 2h ago· X

హర్యానాలోని పంచకుల చండీమందిర్ టోల్ ప్లాజా దగ్గర ఇన్‌స్టా రీల్ కోసం ఓ యువకుడు బైక్‌తో ఫుల్ రిస్క్ స్టంట్ చేశాడు. స్పీడ్‌గా బైక్ నడుపుతూ దానిపై నిల్చొని పోజ్ ఇవ్వబోయి కిందపడ్డాడు. బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ స్టంట్‌ని అతని ఫ్రెండ్ వీడియో తీశాడు. పోలీసులు ఇద్దరినీ గుర్తించారు. స్టంట్‌కి 25 వేలు, వీడియోకి 20 వేల రూపాయల ఫైన్ వేశారు. రెండు బైక్‌లనూ సీజ్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. రీల్స్ కోసం ఇలాంటి రిస్క్‌లు చెయ్యొద్దని పోలీసులు హెచ్చరించారు.

More in National