అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ సీజ్
లక్షద్వీప్‌కి సౌత్ సైడ్‌లో అరేబియా సముద్రంలో సెప్టెంబర్ 25న ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ ATS కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాయి. అనుమానిత ఇరానియన్ బోటును పట్టుకుని, 526 కేజీల హెరాయిన్, methamphetamineను సీజ్ చేశారు. వీటి విలువ 3,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న ఐదుగురు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.


