CJP సౌరవ్ దాస్ ఇప్పుడు ఎక్కడున్నారంటే?

తమను పోలీసులు జాఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు CJP లీడర్ సౌరవ్ దాస్ 'X'లో అప్‌డేట్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచే జంతర్ మంతర్ వద్ద పెద్ద హైడ్రామా నడుస్తోంది. పోలీసులు ఆ ప్రొటెస్ట్ సైట్‌ను డీనోటిఫై చేసినప్పటికీ, అక్కడ జాతీయ జెండాతో నిరసన తెలుపుతూ బారికేడ్లను దాటేందుకు ట్రై చేసినందుకు పోలీసులు వీరిపై ఈ యాక్షన్ తీసుకున్నారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.



