జిల్లాలో దివ్యాంగులకు ఉచిత న్యాయ సేవలు

సూర్యాపేట కలెక్టరేట్‌లో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జిల్లా జడ్జి డాక్టర్ శివరామ్ ప్రసాద్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం ప్రారంభించారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి భవ్య కోవిల, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



